వాస్తు: మీ ఇంట్లో హనుమాన్ ఫోటో పెట్టేటప్పుడు ఈ తప్పులను చేయకండి.. సమస్యలు రావొచ్చు..!

-

చాలామంది వాస్తు ప్రకారం ఫాలో అవుతుంటారు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన అనేక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం ఆంజనేయ స్వామి విగ్రహాలని ఎటువైపు ఉంచితే మంచిది..? ఎలాంటి ఆంజనేయ స్వామి ఫోటోలని ఇంట్లో పెట్టకూడదు వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోలని పెడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఫోటోలు ఇంట్లో పెట్టడం వలన మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. వాస్తు ప్రకారం ఆంజనేయ స్వామి ఫోటోని ఎప్పుడూ దక్షిణం వైపు పెట్టాలి. అది కూడా కూర్చున్న భంగిమలో ఉంటేనే ఎరుపు రంగులో ఉండే ఫోటోని ఇలా ఉంచొచ్చు.

దక్షిణాభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఇంట్లో పెడితే మంచిది ఈ దిశలో ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టడం వలన దుష్ట శక్తులు తొలగిపోయి. అనందం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామిని ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండేటట్టు పెట్టుకోవాలి ఉత్తర ముఖి హనుమంతుని రూపంలో ఉండే ఆంజనేయస్వామిని ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవి కూడా ఆనందపడుతుంది. ఆటంకాలు వ్యాధులు వంటివి దూరం అవ్వాలంటే పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టండి. ఇలా చేయడం వలన ఆటంకాలు తొలగిపోతాయి సంపద కూడా పెరిగేందుకు సహాయపడుతుంది. హనుమంతుడు శ్రీరాముని నమస్కరిస్తున్న ఫోటోని ఇంట్లో పెడితే కూడా మంచి జరుగుతుంది.

ఇలా చేయడం వలన జీవితంలో కష్టాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంట్లో హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్నట్లుగా ఉన్న ఫోటోని కూడా పెట్టొచ్చు. ఈ ఫోటోని పెట్టడం వలన బలం, ధైర్యం కలుగుతాయి. రాముడికి భజన చేస్తున్న భంగిమలో ఉండే ఫోటోని ఇంట్లో పెడితే కూడా విజయాలని అందుకోవచ్చు. ఇలాంటి ఆంజనేయస్వామి ఫోటోని పెడితే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. వాస్తు ప్రకారం తెల్లని రూపంలో ఉన్న ఆంజనేయస్వామిని ఫోటోని కూడా పెట్టొచ్చు. ప్రమోషన్స్ ని పొందాలంటే ఈ ఆంజనేయస్వామిని పెట్టండి. హనుమంతుడు ధ్యానం చేస్తున్న ఫోటోని పెడితే శాంతి కలుగుతుంది. ధ్యానం, మోక్షం వంటి కోరికలు పూర్త అవ్వాలంటే ఈ ఫోటోని పెట్టండి ఇలా వాస్తు ప్రకారం మీరు వీటిని ఆచరించినట్లయితే సమస్యల నుంచి గట్టెక్కొచ్చు సంతోషంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news