అల్లు అర్జున్ రోడ్డు షో వల్లే ప్రమాదం జరిగింది.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి!

-

తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 04న సంధ్య థియేటర్ లో ప్రదర్శించిన ప్రీమియర్ షో కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. వచ్చిన సమయంలో, వెళ్లే సమయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలో తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై అసెంబ్లీలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.

పుష్ప-2 సినిమాకు రేవతి కుటుంబ సభ్యులు రూ.3వేలు ఒక టికెట్ పెట్టి.. రూ.12వేలు పెట్టి సినిమాకి వెళ్లారు. థియేటర్ రావద్దని హీరోకి పోలీసులు ముందే చెప్పారు. హీరోను చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు వచ్చారు.  అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లనే ప్రమాదం జరిగింది. థియేటర్ వద్ద నుంచి వెళ్లి పోవాలని పోలీసులు అల్లు అర్జున్ కి చెప్పారు. అయినా అల్లు అర్జున్ సినిమా ముగిసిన తరువాత వెళ్లిపోతానని చెప్పాడు.  రేవతి చనిపోయిన 11 రోజుల వరకు కూడా ఎవ్వరూ స్పందించలేదు. రేవతి చావుకు కారణం ఎవ్వరు.. మాపై విమర్వలు చేయడం సిగ్గు చేటు అన్నారు. 

సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి  కలిసి వచ్చారు. తల్లి చనిపోయి.. 9ఏళ్ల పిల్లవాడు ఆసుపత్రిలో ఉంటే.. సినీ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సంధ్య థియేటర్ లోంచి  వెళ్లిపోయే ముందు కూడా అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లారు. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి కంట్రోల్ కాలేదు. అందుకే తొక్కిసలాట జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news