బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను : సీఎం రేవంత్ రెడ్డి

-

బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై  అసెంబ్లీలో స్పందించారు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని మండి పడ్డారు.

బన్నీ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సంధ్య థియేటర్ కి హీరో, హీరోయిన్ రావద్దని పోలీసులు చెప్పారు. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే.. ఇంత రాద్దాంతం ఎందుకు అని ఫైర్ అయ్యారు. రేవతి కుటుంబ సభ్యులు నలుగురు కలిసి ఒక్కొ టికెట్ కి రూ.3వేలు ఖర్చు  పెట్టి.. మొత్తం రూ.12వేలు పెట్టి సినిమాకి వెళ్లారు. అయినా సినీ నిర్మాత, హీరో వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్బాయిని పరామర్శించలేదని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news