రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవి కావాలని అశిస్తుంటారు.. సీనియర్లు అయితే.. ఎమ్మెల్సీనో.. ఎమ్మెల్సీగా ఉంటే మంత్రిగానో.. ఇలా తమకు నచ్చిన దాని కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఇదే తరహా ట్రయిల్స్ జరుగుతున్నాయి.. ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలంటూ కొందరు నేతలు అధిష్టానం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట.. ఇంతకీ ఎవరా లీడర్స్..
పదేళ్ల పాటు పార్టీ కోసం పోరాడిన కొందరు నేతలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. దీంతో అధిష్టానం వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి కొందరి నేతల్లో వ్యక్తమవుతోంది.. పవర్ కోసం పోరాటాలు చేసిన తమను పార్టీ అగ్రనాయకత్వం పట్టించుకోవడంలేదని నేతలు తెగ ఫీలై పోతున్నారు.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. పదవులు దక్కకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు.. త్వరలో భర్తీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు ఒకటి ఇవ్వాలంటూ లాబీయింగ్స్ చేస్తున్నారు..
త్వరలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.. ఇందులో రెండు బీసీలకు…ఒకటి ఎస్సీకి..మరొకటి రెడ్డి సామాజికవర్గం నేతకు ఇవ్వాలని పార్టీ భావిస్తోందట.. రెడ్డి సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా చాన్స్ దక్కే అవకాశం ఉండటంతో ఎవరా అదృష్టమంతుడన్నే చర్చ పార్టీలో జరుగుతోంది.. ఆ స్థానం కోసం అరడజను మంది రెడ్డి నేతలు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట. సీనియర్ నేత జీవన్ రెడ్డి గట్టిగా ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.
జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారట. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు.. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి.. భంగపడ్డ రెడ్డి సామాజికవర్గ నేతలందరూ తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారట.. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డి కూడా మహిళా కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు చర్చ జరుగుతోంది.. ఒక్క సీటు కోసం అరడజన్ మంది పోటీలో ఉండటంతో.. ఎవరికి ఇవ్వాలో అర్దంగాక అధిష్టానం కూడా డైలమాలో పడిందట..