కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపై ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికీ కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబు పై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది.
వాయిదా పడిన మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడానికి ఇవాళ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భారీ బందోబస్తు కావాలంటూ పోలీసులను మున్సిపల్ మేయర్ సురేష్ బాబు కోరారు. గత నెల రోజులుగా మున్సిపల్ సమావేశంలో వేదిక పై కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ తరుణంలోనే ఇవాళ జరగబోయే సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే పరిస్థితులున్నాయి. మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.