చాలా మంది ఈ రోజుల్లో ఐరన్ సమస్యతో బాధపడుతున్నారు. హెల్దీగా ఉండాలంటే సరిపడా పోషకాలను తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి. చాలా మంది ఈరోజుల్లో ఎక్కువ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఎక్కువగా మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఐరన్ ని తీసుకోవడం వలన అనేక సమస్యలు తగ్గుతాయి. ఐరన్ మనకి ఈ పండ్లలో లభిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాములు పుచ్చకాయల్ని తీసుకుంటే 0.4 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. పుచ్చకాయల్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి అలాగే దానిమ్మ పండ్లను తీసుకుంటే ఐరన్ బాగా అందుతుంది. దానిమ్మ పండ్లను తీసుకోవడం వలన హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచుకోవచ్చు. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది.
అలాగే మల్బెర్రీ పండ్లను కూడా తీసుకోండి. ఈ పండ్లలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరం తీసుకుంటే కూడా ఐరన్ బాగా అందుతుంది. ఖర్జూర పండ్లను తీసుకోవడం వలన రక్తహీనత సమస్య నుంచి సులువుగా బయటపడుచ్చు. కిస్మిస్ పండ్లను తీసుకుంటే కూడా ఐరన్ బాగా అందుతుంది. రాత్రి వీటిని నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని ఆ పండ్లను తీసుకుంటే మంచిది. ఐరన్ బాగా అందుతుంది ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్ళు అంజీర్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి హెల్త్ కి ఇవి ఎంతో మేలు చేస్తాయి.