ఏపీలో బలోపేతం కోసం బిజేపీ మాస్టర్ స్కెచ్.. సైలెంట్ గా పనిచేస్తున్న క్యాడర్..

-

తెలంగాణ తరహాలో ఏపీలో కూడా బలోపేతం అవ్వాలని బిజేపీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది.. గత ఎన్నికల్లో గెలుపుతో వచ్చిన జోష్ ను కంటిన్యూ చెయ్యాలని భావిస్తోంది.. ప్రభుత్వంలో ఉంటూనే.. స్వంతంగా ఎదరగాలని వ్యూహ రచన చేస్తోంది.. రూట్ లెవల్ లో పాతుకుపోవాలని..అందుకు జనసేన మద్దతు తీసుకోవాలని అగ్రనాయకత్వం సీరియస్ గా ప్రయత్నిస్తోంది..

గత ఎన్నికల్లో టీడీపీ. జనసేనతో జట్టుకట్టి ఊహించని పలితాలను సాధించిన బిజేజీ.. అదే టెంపోను మెయింటైన్ చెయ్యాలని చూస్తోంది. భవిష్యత్ లో రాష్టంపై మరింత పట్టుపెంచుకోవాలని చూస్తోంది.. 2014,2019,2024లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటున్న కమలం పార్టీ.. అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటోంది.. అందుకు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఏపీలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది.. ఆ దిశగా రాష్ట పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిందట.. పార్టీ కార్యాలయాల్లో ఉండకుండా.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించిందట. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని.. ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట నాయకత్వ సూచనలను అమలు చెయ్యాలని నేతలకు గట్తిగానే చెప్పిందట.గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలతో పాటు.. రెండో స్తానానికి పరిమితమైన నియోజకవర్గాల జాబితాను సిద్దం చేసి జాతీయ నాయకత్వానికి పంపారట.. బిజేపీ నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకుని.. వారి ఆలోచలనకు తగ్గట్టు పార్టీని బలోపేతం చేసుకోవాలని నేతలు చూస్తున్నారు..

రెండేళ్లలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బిజేపీని మార్చేలా నేతలు కష్టపడి పనిచెయ్యాలని కమలం అగ్రనేతలు ఆదేశించారని పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేనతో మరింత బంధం పెంచుకుని.. దశలవారీగా బలం పుంజుకునేలా ప్లాన్ చేస్తోంది.. తెలంగాణాలో పట్టు సాధించినట్టే.. ఏపీలో కూడా పట్టు పెంచుకోవాలని జాతీయ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.. వారి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news