వయనాడ్ బై పోల్ లో ప్రియాంకగాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు.. సోదరుడు రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీని క్రాస్ చేశారు.. ఐదు లక్షలకు పైగా మెజార్టీ సాధించి కొత్త రికార్డ్ ను సృష్టించారు.. పార్లమెంట్ లో అడుగు పెట్టిన ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు.. ఈ క్రమంలో ఆమె ఎన్నికపై ఓ వివాదం నడుస్తోంది.. ఇంతకీ ఏంటది..?
గత నవంబర్ లో వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రియాంక గాంధీ ఎన్నికయ్యారు.. రాహుల్ గాంధీ రాజీనామాతో ఆమె బరిలోకి దిగారు.. అక్కడి ప్రజలు భారీ మెజార్టీ అందించారు.. అయితే ఆమె గెలుపు చెల్లదని బిజేపీ అభ్యర్ది నవ్య ఆరోపిస్తున్నారు..ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఆమె కుటుంబ, ఆస్తుల వివరాలు తప్పుగా చూపించారనేది నవ్య హరిదాస్ వాదనగా ఉంది.. చాలా ముఖ్యమైన విషయాలను ప్రియాంక గాంధీ దాచిపెట్టారని నవ్య ఆరోపిస్తోంది.. దీనిపై హైకోర్టులో పిటీషన్ వేసినట్లు చెప్పారామె..
ఇదే విషయంపై ఆమె ఎన్నికల కమిషనర్ కు కూడా పిర్యాదు చేసినా.. ఆమె అభ్యంతరాలను ఈసీ పరిగణలోకి తీసుకోలేదు..దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.. దీనిపై జనవరిలో విచారణ జరిగే అవకాశముందని నవ్య వెల్లడిస్తున్నారు. అయితే నవ్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.. పబ్లిసిటి కోసం నవ్య చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని వారంటున్నారు.. న్యాయస్తానాకి వెళ్లినా.. తమకు ఎలాంటి నస్టం లేదని స్పష్టం చేస్తున్నారు.
దేశంలోని ప్రతి రాష్టంలోనూ.. ఓడిన బిజేపీ అభ్యర్దులు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం మాములుగా మారిందని మాణిక్య ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజకీయ లబ్ది కోసం బిజేపీ ఇలాంటి చర్యలకు దిగుతుంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. అయితే దీనిపై ప్రియాంకగాంధీగానీ, బిజేపీ అగ్రనాయకత్వం కానీ ఇంతవరకు ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు.. మొత్తంగా వయనాడ్ పంచాయతీకి ఇప్పట్లో ఎండ్ కార్డుపడేలా లేదు..