ప్రజా శాంతి పార్టీ నేత KA పాల్ నిజామాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనే అల్లు అర్జున్ అయితే రేవతి కుటుంబానికి 300 కోట్ల సహాయం చేసే వాడిని అని అన్నారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలని OU విద్యార్థులు డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. అలాగే రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగ పరిపాలన చేస్తున్నారు. 422 బిల్డింగ్ లు అక్రమంగా కూల్చివేశారు. కానీ తన తమ్ముడి బిల్డింగ్ ఎందుకు కూల్చలేదు అని అన్నారు.
తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వాసులు అవుతుంది అని ఫిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్, BRSప్రభుత్వలవి పచ్చి అబద్ధాలే. రెండు ప్రభుత్వాల్లో సర్పంచులు అప్పుల పాలయ్యారు. నా మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారు. రేవంత్ నన్ను వాడుకొని వదిలేశాడు. పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. మరో రెండేళ్లలో జామిలి ఎన్నికలు ఖాయం అని KA పాల్ పేర్కొన్నారు.