ప్రజాభవన్ లో జరిగిన బ్యాంకర్స్ సమావేశములో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని సూచించారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. త్వరలో టెండర్లు పిలుస్తాం అన్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో 54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా 44,438 కోట్లు, 81.57 శాతం విడుదల చేశారు. రబీ రుణాల పంపిణీకి నెలరోజుల సమయం ఉన్నందున వేగం పెంచాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు జమ చేశాము. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీలేనీ రుణాలు ఇస్తుంది. రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.