మంత్రి కోమటిరెడ్డి పబ్లిసిటీ పాలిటిక్స్ చేస్తున్నారు : ఎంపీ రఘునందన్ రావు

-

ఫార్ములా ఈ రేసు ఎపిసోడ్ లో భారత ప్రభుత్వం, RBI అనుమతి లేకుండా మన సొమ్ము దేశం దాటి పోయింది అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ ఫార్ములా కేసులో కచ్చితంగా ఈడీ వస్తుంది… చట్టం ముందు సీఎం కొడుకైనా యువరాజైనా ఒకటే. ఏడున్నావ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ చెయ్ అని ట్వీట్లు చేసిన కేటీఆర్ కేసు కాగానే కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాడు. నువ్వే అరెస్ట్ చేయమని చెప్పి ఇప్పుడు ఎందుకు కేటీఆర్ భయపడుతున్నారు. గతంలో ఆయన చెల్లి కవిత కూడా ఇలానే వ్యాఖ్యలు చేసింది. కక్షసాధింపు చర్యలు అంటున్న కేటీఆర్ భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఇక మంత్రి కోమటిరెడ్డి పబ్లిసిటీ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తుంది.. చావులను కూడా రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి వాదన వారు చెబుతున్నారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి సీఎం మెప్పు పొందాలని చూస్తున్నారు. గురుకులాలు, హాస్టళ్లలో చనిపోయిన 42 మంది విద్యార్థుల కుటుంబాలకు కూడా 25 లక్షలు ఇస్తే బాగుండేది. చనిపోయిన రైతుల కుటుంబాలకు కూడా పరిహారం ఇస్తే కూడా బాగుండేది అని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news