మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత…!

-

ప్రస్తుతం టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ వార్తలో ఉంటున్నాడు కానీ.. కానీ బన్నీకి ముందు మంచు ఫ్యామిలీలో జరిగిన రగడ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది అనే చెప్పాలి. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవ.. మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. తర్వాత మోహన్ బాబు కేసు పెట్టడం.. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల పైన ఆయన దాడి చెయ్యడం వంటి ఘటనలి జరిగాయి. దాంతో మోహన్ బాబు పైనే కేసు నమోదయ్యింది.

కానీ మీడియా పై దాడి చేసిన తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయిన మోహన్ బాబు.. తాను అనారోగ్యంగా ఉన్నాను.. కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. కానీ తాజాగా హై కోర్ట్ మోహన్ బాబు యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దాంతో ఏ క్షణమైనా మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయవచ్చు అనే చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news