వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కులమత సాంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయి అని అన్నారు. ప్రతిఒక్కరు ఆద్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలి ఐ సూచించారు. అన్ని కులమతాలకు రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తుంది. బతుకమ్మ సంస్కృతిని వెస్టర్న్ కల్చర్ తో బ్రస్టుపట్టిస్తున్నారు. అల్లు అర్జున్ పాట.. ఊ అంటవా మామ ఉఉ అంటావా వంటి పాటలను క్రిస్టియన్ పాటల్లో జోడిస్తున్నారు.
ఇక మన మతాల పైన విశ్వాసాలని మనమే కాపాడుకోవాలి. మా బతుకమ్మ పండుగని వెస్టర్నైట్ చేశారు. ఇప్పటికే బతుకమ్మ సాంప్రదాయాన్ని పాడు చేశారు. ప్రతిఒక్కరికి వారి మతం పై గౌరవ మర్యాదలు ఉండాలి. అది అవలంబించే భాద్యత మనదే. దయచేసి డీజే,సినిమా పాటలు సంస్కృతి సంప్రదాయాలకు ఇక నుండి వాడకుండా చూడాలి అని మంత్రి కొండా సురేఖ అన్నారు.