ఒక అభిమాని సినిమా థియేటర్ కి వెళ్తే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని మంత్రి సీతక్క అన్నారు. ఇక చట్టానికి లోబడి అతనిపై కేసు పెట్టడం జరిగింది. మహిళ చనిపోతే ఆ సినిమా నటుడు పరామర్శించకపోవడం చాలా బాధాకరం. ఆకుటుంబానికి సహాయం చేయకుండా,ఆ నటుడుడిని మిగతా నటులు పరామర్శిస్తున్నారు. చివరికి అభిమానే సినిమాకి వెళ్లడం తప్పుగా అన్నట్లు చేస్తున్నారు. నటుడు అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి గాని, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి కోపం లేదు. ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. చట్టానికి ఉన్న పరిమితులు లోబడే చట్టం తన పని చేసుకోపోతుంది.
ప్రజలను హక్కులను కాపాడుకోవడానికి,చట్టాన్ని రక్షించుకోవాలి,చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అర్హులే. అతిగా ఎవరు ప్రవర్తించిన వారకి శిక్షా ఉంటుంది, ప్రజలకు భరోసా ఉంటుంది. చట్టం యొక్క నియమ,నిబంధనలు అనుసరిస్తేనే శాంతి ఉంటుంది,క్రమ శిక్షణ ఉంటుంది. ఇక జై భీమ్ సినిమా అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది.. అటువంటి సినిమాకి ఒక్క అవార్డు ఇవ్వలేదు.. గుర్తించలేదు. కానీ ఒక స్మగ్లింగ్ చేసే సినిమాకు గొప్పగా అవార్డు ఇస్తున్నారు. స్మగ్లింగ్ చేసే సినిమాలో రాజ్యాంగబద్ధంగా పనిచేసే అధికారులను బట్టలిప్పి చూపించారు.. అటువంటి సినిమాలు గొప్పగా పొగుడుతారు.. అవార్డులు ఇస్తారు.సినిమాలకు సినీ కుటుంబాలకు మేము కూడా మద్దతుగా ఉంటాం.. కానీ సొంత సిబ్బందితో జనాలను ఇబ్బందులు గురి చేస్తే ఊరుకునేది లేదు. పేదవారు తప్పు చేస్తే కేసులు పెడుతున్నాం.. పెద్దింటి వారు తప్పు చేస్తే కేసులు పెట్టొద్దు అనడం ఇది ఎక్కడ న్యాయం. భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం అందరూ సమానులే.. దానినే మేము అనుసరిస్తున్నాం అని మంత్రి సీతక్క అన్నారు.