అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. అల్లు అర్జున్ విచారణ పూర్తి కావడంతో… పీఎస్ వద్ద అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇక మరి కాసేపట్లో పీఎస్ నుంచి బయటకు రానున్నారు హీరో అల్లు అర్జున్.
హీరో అల్లు అర్జున్ వాహనాలతో పాటు పోలీసుల వాహనాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను ప్రశ్నించిన పోలీసులు… కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే.. ఈ కేసులో ఇవాళ అయితే.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ లేదని పోలీసులు ప్రకటించారట.
కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు.. రూ.2 కోట్లతో శ్రేతేజ్ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టారట అల్లు అర్జున్. ఇందుకోసం బన్నీ రూ.1 కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. ఇక ఈ ట్రస్ట్‌లో సభ్యులుగా.. శ్రీతేజ్ తండ్రి, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు ఉంటారని సమాచారం.