విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 27న వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చడం లేదు. విద్యుత్ చార్జీలను పెంచబోనని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రెండు విడతల్లో ప్రజలపై రూ.15 వేల కోట్ల మేర భారం మోపారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు నిరసనగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి.
అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడం.. ప్రజల పక్షాన పోరాడుతాం. 2014 నుంచి 19 వరకూ ఎన్నో పోరాటాలు చేశాం. క్రిస్మస్.. సంక్రాంతి.. రంజాన్ కానుకలను ప్రభుత్వం ఇవ్వలేదు. చంద్రబాబు కేవలం మాటలు మాత్రమే చెబుతారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని కాకాణి అన్నారు.