Another CTV footage has been released in Sandhya Theatre: సంధ్య థియేటర్ ఘటనలో సంచలన వాస్తవాలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి రావడానికి 20 నిమిషాల ముందే సంధ్య థియేటర్ లోపల తొక్కిసలాటలో శ్రీ తేజ్ స్పృహ తప్పి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
కొత్తగా విడుదల ఐన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం థియేటర్ లోపల తొక్కిసలాట జరగగా రాత్రి 9:16 గంటల సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీ తేజ్ ను బయటకి కొందరు యువకులు తీసుకువచ్చారు. తొక్కిసలాట జరిగింది థియేటర్ లోపల కానీ బయట కాదు అని చెబుతున్నారు.
పోలీసులు అందించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆ సమయంలో 9:28 నుండి 9:34 వరకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అల్లు అర్జున్ ఉన్నారు. ఓ అభిమాని తీసిన ఫోటోలో సైతం 9:33 సమయంలో థియేటర్ బయటే ఉన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ లోపల జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేస్తున్న పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.
సంధ్య థియేటర్ ఘటనలో సంచలన వాస్తవాలు
అల్లు అర్జున్ థియేటర్ లోపలికి రావడానికి 20 నిమిషాల ముందే సంధ్య థియేటర్ లోపల తొక్కిసలాటలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీ తేజ్
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం థియేటర్ లోపల తొక్కిసలాట జరగగా రాత్రి 9:16 గంటల సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీ తేజ్ ను బయటకి… pic.twitter.com/gpxHN05Nn3
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024