‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి అవతారం ఎత్తబోతున్నారు. ‘బలగం’ వేణు దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఎల్లమ్మ. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. తర్వాత బలగం సినిమాకి దర్శకత్వం వహించి తనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి కమెడియన్ గా వేణు వచ్చాడు.
పలు సినిమాల లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక్కో సినిమా తో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బలగంతో హిట్ అయ్యాడు. అయితే.. వేణు వెల్దండి చేయ బోయే ఎల్లమ్మ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘ఎల్లమ్మ’ గా సాయి పల్లవి అవతారం ఎత్తబోతున్నారు. నితిన్ కథానాయకుడిగా ఎంపికయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సాయి పల్లవి ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందని చెబుతున్నారు. సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కూడా కానుందట.