సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు వార్నింగ్‌..ఆ వీడియోలు పెడితే !

-

సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఘాటు హెచ్చరికలు ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు. ప్రజలను అపోహలకు గురిచేసేలా, పక్కదారి పట్టించేలా పోస్టులు చేయవద్దని కోరారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపై నిఘా ఉంచామన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే వీడియో రూపంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని తెలిపారు.

Police warning on Sandhya Theater incident

అయినా కొంతమంది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. కేసు విచారణ దశలో ఉన్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖను కించపరిచేలా ప్రచారాలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఓ మహిళ మరణం మరో పిల్లాడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నారన్నారు. ఈ ఘటనపై ఎవరి దగ్గరైనా అదనపు సమాచారం కానీ వీడియోలు కానీ ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అప్పగించండి సొంత వ్యాఖ్యానాలను సోషల్ మీడియాలో చేయవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news