Chennai: చెన్నయ్ అన్నా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. చెన్నై అన్నా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేశారట గుర్తుతెలియని వ్యక్తులు. గత రాత్రి క్యాంపస్ ఆవరణలో తన ప్రియుడుతో మాట్లాడుతున్న సమయంలో అతనిపై దాడి చేసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారట నిందితులు.
యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ ఘటన జరగడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అటు విద్యార్థి సంఘాలు..ఆందోళనకు దిగాయి. అన్నా యూనివర్సిటీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పది ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందని… ప్రముఖ యూనివర్సిటీగా ఉండే అన్న వర్సిటీలో ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ లేకపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి చీఫ్ అన్నామలై.