సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్భంధించడం పట్ల హరీశ్ రావు ఫైర్..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించిన పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. మెదక్ పట్టణంలో శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి.. నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీశ్ రావు. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెల్తున్న సీఎం గారు.. టెంట్లు పీకేయడం కాదు. వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్తం చేసుకోండి అని హరీశ్ రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని.. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి.. ఏడాది గడిచినా ఉలుకు లేదు.. పలుకు లేదన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news