ప్రేమోన్మాది వేధింపులు…యాసిడ్ తాగి యువతి ఆత్మహత్య !

-

దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఓవైపు కామాంధులు లైంగిక దాడులకు తెగబడుతుంటే.. మరోవైపు ప్రేమ పేరుతో వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.

crime

ప్రేమించాలని ఓ యువకుడు వేధించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థినిని నిఖిల్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. చాలాకాలంగా అతడి వేధింపులు భరించిన పూర్ణిమ ఇక నిఖిల్ వేధింపులు తాళలేక నిన్న రాత్రి ఆసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి పూర్ణిమ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి.. బంధువులకు అప్పగించారు. అనంతరం నిందితుడు నిఖిల్ పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news