7 నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేశారు అంటూ ఆగ్రహించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. విద్యుత్ చార్జీలపై నిరసన కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని… ఎన్నికల ప్రచారంలో విద్యుత్ చార్జీలు పెంచమని ఆనాడు సీఎం హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే 15 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని ఆగ్రహించారు.
మా ప్రభుత్వం హయాంలో 48 వేల కోట్ల రూపాయలు డిస్కమ్స్ కు సబ్సిడీ ఇచ్చాం…సామాన్యుడిపై భారం వేయకూడదని ఆనాడు జగన్ అంత డిస్కంస్ కు ఇచ్చాడని గుర్తు చేశారు. ప్రజలపై భారం వేయడం సమంజసం కాదని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్ దేవుడు అనడం ఎన్నికల అనంతరం ఓటర్లు దయ్యాలయ్యారా ?? అంటూ నిలదీశారు. నిన్న జగన్ ప్రజా దర్బార్ కు విశేష జనం వచ్చారన్నారు. కేవలం ఏడు మాసాల్లో లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేసింది…ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శలు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. లక్ష కోట్లు అప్పు తెచ్చి, హామీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది… ప్రభుత్వం హామీలు అమలు చేయడం లో ఘోరంగా విఫలమైందన్నారు.