ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో కిరాతకమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. నగల కోసం ఓ కొడకు తన కన్నతల్లిని భార్య సాయంతో హత్యచేశాడు.విజయవాడలోని గుణదల పరిధిలో గల మధునగర్‌లో ఈ హత్య శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మి (62) మధునగర్‌లో స్థానికంగా నివాసం ఉంటున్నది.
ఈ క్రమంలోనే తనకు ఆస్తి రాసివ్వాలంటూ పెద్ద కుమారుడు సాంబశివరావు ఆమెతో గొడవపడుతున్నాడు. దీంతో తరచూ వీరిమధ్య గొడవ జరుగుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే కొడుకు సాంబశివరావు, కోడలు ఇద్దరూ కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి లక్ష్మిని చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని మాయం చేశారు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా కుమారుడే హత్య చేసినట్లు గుర్తించారు.ఈ మేరకు సాంబశివరావును అదుపులోకి తీసుకుని విచారించగా తల్లిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.