మెరుగైన ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు వంటివి ఎంత అవసరమో నట్స్ కూడా అంతే అవసరం. వాటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి మరియు అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో వాల్నట్స్ ఒకటి. నానబెట్టిన వాల్నట్స్ ను ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడం వలన మీ బ్రెయిన్ కు అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అందుతాయి. దీంతో మెదడు ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. నానబెట్టిన వాల్నట్స్ ను తీసుకోలేకపోతే వాటిని మీ స్మూతీలో కూడా తీసుకోవచ్చు.
కనుక స్మూతీ తయారు చేస్తున్నప్పుడు నానబెట్టిన వాల్నట్స్ ను కలిపి తీసుకుంటే ఎంతో క్రీమీ గా మీ స్మూతీ తయారవుతుంది. అంతేకాక ఎన్నో రకాల పోషకాలు కూడా మీ మెదడుకు అందుతాయి. మెదడు ఎంతో చురుకుగా పని చేయాలి అంటే నానబెట్టిన వాల్నట్స్ ను తీసుకోవడం ఎంతో అవసరం. వీటిని తీసుకోవడం వలన మెదడుకు ఎంతో శక్తి లభిస్తుంది మరియు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చాలా మంది సహజంగా కేవలం నట్స్ ను తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు సలాడ్స్ లో కూడా నట్స్ ను తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన సలాడ్ క్రిస్పీ గా మాత్రమే కాకుండా రుచిగా ఉంటుంది. దీంతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ మధ్యకాలంలో ఓట్ మీల్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఓట్ మీల్ లో కూడా వాల్నట్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వలన పోషకాలతో పాటుగా మెదడు పవర్ కూడా పెరుగుతుంది. ఎన్నో పోషకాలు ఉండేటువంటి ఎనర్జీ బార్స్ లో వాల్నట్స్ ను కూడా కలిపి తీసుకుంటే మెదడు ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. సహజంగా చాలా మంది పల్లీలు, బాదంపప్పు వంటి వాటినే నట్ బటర్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే వాల్నట్స్ తో కూడా నట్ బటర్ తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మెదడు పనితీరు బాగుంటుంది.