ఫార్ములా- ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్..!

-

ఫార్ములా- ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాజాగా ఆయన ఓ మీడియాతో ప్రతినిధిలో మాట్లాడారు. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు అప్పట్లోనే గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు.  కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం అని తెలిపారు.

ఫార్ములా-ఈ కేసులో ఎటువంటి అవినీతి లేదని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు..? మీరు ఏమంటారని మీడియా ప్రతినిధి దానం నాగేందర్ ను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో అంతర్జాతీయ టీమ్ కూడా వచ్చిందని.. ఫార్ములా -1 కోసం వచ్చారని దానం నాగేందర్ తెలిపారు. ఫార్ములా-ఈ రేసు మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే నడిచిందని తెలిపారు. అంతర్జాతీయ  దృష్టిని కేంద్రీకరించడానికి ఫార్ములా-ఈ ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. అవినీతి ఉందా..? లేదా..? అనేది మనం చెప్పలేం. దుబాయ్ తీసుకెళ్లాలని అనుకున్నా.. పోటీలో కేటీఆర్ పట్టుబట్టి హైదరాబాద్ కి తీసుకొచ్చారని తెలిపారు. అవినీతి విషయం పట్ల స్పందించడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్టు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news