డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. మాస్ అభిమానులకు పండుగే..!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  అయితే  సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో బాబీ దర్శకత్వలో డాకు మహారాజ్ తెరకెక్కుతుంది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్,  సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లోనే పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తోంది. అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్ అదుర్స్ అనే చెప్పాలి. తాజాగా విడుదలైన ట్రైలర్ లో బాలయ్య డైలాగులు ఈలలు వేయించేలా ఉన్నాయి. రాయలసీమ మనుతెరుగు ఓబీ నా అడ్డా.. చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో మాస్టర్స్ చేశానని బాలయ్య డైలాగులు ఆకట్టుకున్నాయి. బీజీఎం, బాలయ్య డైలాగ్ లు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news