తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హుల ఎంపిక పైన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 12,000 ఇస్తామని వెల్లడించారు.
అయితే సంవత్సర కాలంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుందని కూడా ఆయన వివరించడం జరిగింది. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను చేయాలని కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద ఒక్క కుటుంబానికి ఏటా 12 వేల రూపాయలు ఇస్తామని ఆయన వెల్లడించడం జరిగింది. ఈనెల 26వ తేదీన స్కీమును ప్రారంభించనున్నట్లు తెలిపారు.