మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతాం : కేటీఆర్

-

బీఆర్ఎస్ నేత కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడంతో NSUI నాయకులు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది ఆఫీస్ ఫర్నిచర్. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా  యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. “మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే.. తగిన గుణపాఠం చెబుతాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని.. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి” అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news