మెదక్ లో దారుణం..మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ !

-

మెదక్ లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దె పై గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా వెలుగులోకి వచ్చింది ఈ అత్యాచార ఘటన.

Gang rae of paranoid woman at Ambedkar statue

ఇక ఈ సంఘటన నేపథ్యంలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. మతి స్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news