తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు అవసరం అయితే విపక్ష నేతల అనుభవాన్ని కూడా ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి విద్యాసాగర్ రావు సేవలు అవసరం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే.. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు.
తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్తగా ఎదిగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు దేశంలో సిటీలలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ నేడు 9వ స్థానానికి పడిపోయిందని కామెంట్ చేసారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అన్ని పార్టీల నేతలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.