Telangana: మాజీ ఎంపీ మందా జగన్నాథం మరణించిన నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార లాంచనాలతో మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో…. అధికార లాంచనాలతో మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు జరుగనున్నాయి.
కాగా, అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించి నివాళులర్పించారు. ముందుగా మందా పార్థివదేహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
అధికార లాంచనాలతో మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు https://t.co/BL43dHyndm pic.twitter.com/oEOrIBfAYR
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025