జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నా మీద దాడి చేశారు : కౌశిక్ రెడ్డి

-

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నా మీద దాడి చేశారు. నేను సంజయ్ మీద దాడి చేయలేదు అని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దాడి కంటే ముందు నా పక్కన సంజయ్ కూర్చొని.. ఇప్పుడు చూడు మీ BRS వాళ్ళ బట్టలు ఎలా విప్పుతానో అన్నారు. తర్వాత నన్ను నెట్టివేశాడు. అయితే జగిత్యాల MLA సంజయ్ డబ్బులకు అమ్ముడు పోయిన ఒక బ్రోకర్, ఒక దొంగ. పార్టీ మారిన బీఆర్ఎస్ MLA లను బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో కొడతారు.

పార్టీ మారిన MLA లను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నాడు. అందుకే రేవంత్ రెడ్డినే ఆదర్శం. గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మైకు గుంజుకున్నాడు. కానీ ఆ ఇద్దరికి సిగ్గులేదు. ఇప్పుడు రేవంత్ సీఎం,అదే క్యాబినెట్ లో జూపల్లి మంత్రి అని గుర్తు చేసాడు పాడి కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news