రాహుల్ గాంధీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా విదేశీ శక్తులకు ఊతమిచ్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు రఘునందన్ రావు. గండిపేట పుప్పాలగూడ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ప్రోత్సహించేలా, బంగ్లాదేశ్ చోరబాటు దారులకు మద్దతు ఇచ్చేలా వివిధ సందర్భాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల దేశ ప్రజలు మండిపడుతున్నారని గుర్తు చేశారు.
భారతదేశంలో ఉంటూ భారతదేశంలోనే పోరాడాల్సి వస్తుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శోచనీయమన్నారు. దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులకు ఊతమిచ్చేలా రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే గడిచిన మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందని రఘునందన్ రావు విమర్శించారు.