ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అమరావతిలో ఇవాళ జరగనుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం నేడు ఉదయం 11 గంటల సమయంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్… ఇప్పటికే 203 అన్న క్యాంటీన్ ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం తెలిపింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పైన చర్చ జరగనుంది. అలాగే తల్లికి వందనం రైతు భరోసా హామీల అమలుపై కూడా చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు కేబినెట్ సభ్యులు. పలు కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు పైన కూడా… చంద్రబాబు కెమినేట్ నిర్ణయం తీసుకుంటుంది. కీలక బిల్లులపై ఆమోదం ముద్ర కూడా వేయనుంది. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా చర్చించే ఛాన్స్ ఉంది.