Hari Hara Veera Mallu: ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది..ఇక పవన్‌ ఫ్యాన్స్‌ కు జాతరే!

-

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం కారణంగా ఈ చిత్రం రిలీజ్‌ ఆలస్యం అయింది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే… హరిహర వీరమల్లు మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది.

harihara

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త MM కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం ఇప్పటికే ధృవీకరించింది. అయితే.. తాజాగా హరిహర వీరమల్లు ఫస్ట్‌ సింగిల్ రిలీజ్‌ అయింది. ‘వీరమల్లు’ మాట చెబితే వినాలంటూ ఓ సాంగ్‌ను వదిలింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ పూర్తిగా ఉంది. ఇక ఈ పాట విన్న ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news