చంద్రబాబు హయాంలో రైతులు నష్ట పోవాల్సిందే : మాజీ మంత్రి కాకాని

-

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి.. ఆరునెలల్లో వచ్చే పన్ను ఆదాయం తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరిగింది అని వైసీపీ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పెట్టుబడులు తగ్గి, వినియోగం తగ్గితే వృద్ధి రేటు పెరగటం ఎలా సాధ్యం. ప్రజల్లోకి ఓ తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. 15 శాతం వృద్ధి రేటు సాధించాలని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని దాచాలని చూస్తున్నారు. 2018, 19 ఏడాదిలో జీడీపీ 18వ స్థానంలో ఉంది.. పారిశ్రామిక నికర విలువ 11వ స్థానంలో ఉంది. 2022, 23 ఏడాదికి జీడీపీ 15వ స్థానానికి చేరుకుంది.. పారిశ్రామిక నికర విలువ 9వ స్థానానికి చేరుకుంది.

ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే జగన్ మరోసారి రాడని పెట్టుబడిదారులు బాండ్ పేపర్ కోరుతున్నారని చంద్రబాబు, లోకేష్ దుష్ప్రచారం. రికార్డులు దాచిపెట్టినా దాగవు.. చెప్పే మాటల్లో పొంతన ఉండాలి. చంద్రబాబు ప్రకటనలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. తెలిసి చెబుతున్నారా.. తెలియక చెబుతున్నారా.. ఎవరైనా చెప్పమంటే చెబుతున్నారా ఆయనే చెప్పాలి. ఆర్ధిక పాఠాలు ఆయన చెబితే వినాలంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. గడిచిన ఏడు నెలల కాలంలో రైతులకు చెప్పిన ఆర్ధిక సాయం అందక ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు హయాంలో అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టితో రైతులు నష్ట పోవాల్సిందే. ఇద్దరు పిల్లల్ని కనాలని చెబుతున్న చంద్రబాబు.. ఆయన, ఆయన కుమారుడు లోకేష్ ఎంత మందిని కన్నారు. మీ బలవంతపు నిర్ణయాలు ప్రజలపై రుద్దకండి. గంటల కొద్ది ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలి.. ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి అని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news