టాలీవుడ్‌ లో విషాదం..యజ్ఞం నటుడు మృతి !

-

టాలీవుడ్‌ లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో గుండెపోటు తో మరణించారు విజయ రంగ రాజు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగ రాజు…. ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అయితే…ఇవాళ ప్రవేట్ హాస్పిటల్ లో గుండెపోటు తో మరణించారు విజయ రంగ రాజు.

Actor Vijay Rangaraju alias Raj Kumar passed away

ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని సమాచారం. ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు టాలీవుడ్‌ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్. 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. యజ్ఞం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకన్నారు. యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో నటించాడు టాలీవుడ్‌ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు రాజ్ కుమార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news