వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై హైడ్రా లో ఫిర్యాదు అందింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై హైడ్రా లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అమీన్ పూర్ లో 193 సర్వే నంబర్ లో ల్యాండ్ కబ్జా కు గురైందని… పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ ఇద్దరు కలిసి కబ్జా చేశారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశాడు..అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రా కు సమర్పించానని వివరించింది ఆ మహిళ.
చెరువు ఔట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టి పోసి ఎత్తు పెంచారు….దాని వల్ల చెరువు పెద్దగా విస్తరించి.. రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు చేశారు. చాలా లే ఔట్ లు, అగ్రి కల్చర్ ల్యాండ్స్ మునిగి పోయాయి.. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ పిక్చర్స్, ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్ కు అందజేసానని తెలిపారు మహిళ. హైడ్రా కమిషనర్ కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..ఇప్పటికే కబ్జా కు గురైన మా లే ఔట్ ప్లాట్లు, రోడ్లు విడుదల జరిగాయని తెలిపారు.
కానీ ఇంకా చాల ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయి..అందుకు కారణం నాళా ను మూసేసి నీళ్ళు వెళ్లకుండా చేయడమేని వివరించారు ఆ మహిళ.