ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు చూస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వస్తే.. మీకు యాదికి ఉందో లేదో.. కానీ క్రికెట్ మ్యాచ్ కి ఎంత మంది అయితే టీవీల ముందు కూర్చుంటారో.. కేసీఆర్ ప్రెస్ మీట్ కు అట్లా కూర్చున్నారు. కేసీఆర్ మాటలు వింటే ధైర్యం వస్తది అని.. ఇంట్లో పెద్దవాళ్లు, చిన్నపిల్లలు కూర్చునేవారు. కేవలం తెలంగాణ వాళ్లే కాదు.. ఆంధ్రా రాష్ట్రం వాళ్లు కూడా కేసీఆర్ మాట వినాలని ఆసక్తికనబరిచేవాళ్లు అని గుర్తుకు చేశారు.
2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వస్తే.. అదే నెల 21న హమాలీలను పిలిచి వారి సమస్యలపై మాట్లాడిండు. ఇలా హమాలీలతో భారతదేశంలో ఎవరూ లేకపోవచ్చు. ఐదేండ్లు సీఎం పదవి చేసినా వారి సమస్యలను తెలుసుకోని సీఎంలు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చెమట చిందిస్తున్న కార్మికుల గురించి ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తది అన్నారు కేటీఆర్.