తెలంగాణ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివేంజ్ పాలిటిక్స్ పై జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. అయినా రివేంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదని సూచించారు. అలాంటి రాజకీయాలు చేసే వాళ్లు అధికారం పోయాక బాధపడాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి పాలిటిక్స్ చేయలేదన్నారు.
ఎవరైనా తనకు నష్టం చేసినా.. తానెవ్వరికీ నష్టం చేయను అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. కాకపోతే రాజకీయ యుద్ధం మాత్రం చేస్తామని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్టుగా ఎవరైనా ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. తనతో సహా పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడు ఎవ్వరూ ఉండరని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం మారడం విశేషం.