రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది : మంత్రి ఉత్తమ్

-

కొత్త రేషన్ విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ప్రస్తుతం 90 లక్షల కార్డులు – 2 కోట్ల 80 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. BRS పదేళ్ల పాలనలో 60వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని మా అంచనా. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నాం.

సన్న బియ్యం పంపిణీ వల్ల 11వేల భారం ప్రభుత్వం పై పడుతుంది. ప్రజా పాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేస్తున్నాం. లిస్ట్ లో పేర్లు రాని వాళ్ళు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలి. హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు BRS మోసం చేసింది.. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారు. కృష్ణ ట్రిబ్యునల్ అంశంలో హరీష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నీళ్ల విషయాల్లో కేసీఆర్ – హరీష్ రావు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టారు. పోతిరెడ్డిపాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారు. కెసిఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 298 TMC లకి సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news