భారత్ వరుసగా రెండు టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సొంతగడ్డపై అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ భారత జట్టు టీ-20 సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో ఇవాళ తొలి టీ-20 మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లూ కుర్రాళ్లు, హిట్టర్లతో కళకళలాడుతోంది. ఈ సిరీస్ లో పరుగుల తుఫాన్ ఖాయంగా కనిపిస్తోంది.
5 మ్యాచ్ ల సిరీస్ కు బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో తెరలేవనుంది. ఈనెల 25న చెన్నై, 28న రాజ్ కోట్, 31న పుణె, ఫిబ్రవరి 02న ముంబయి వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి. టీ-20 సిరస్ తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోపీ జరుగనున్న నేపథ్యంలో కూర్పులు, ప్రయోగాలకు ఈ రెండు సీరిస్ లను వేదికలుగా చేసుకోవాలని భారత్, ఇంగ్లాండ్ భావిస్తున్నాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లో నువ్వా నేనా..? అన్నట్టు హోరా హోరీ పోరు జరుగనుంది.