కాళేశ్వరం కమిషన్ విచారణకు వి.ప్రకాశ్ హాజరు

-

కాళేశ్వరం  ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కమిషన్ ఎదుట జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ హాజరయ్యారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వి.ప్రకాశ్.. ఈ విచారణలో 101వ సాక్షిగా తన స్టేట్ మెంట్ ను కమిషన్ రికార్డు
చేసుకుందని తెలిపారు. తన వద్ద సమాచారం ఉందని గతంలో తాను కమిషన్ కు ఓస్టేట్ మెంట్, ఓ
నోట్ సమర్పించానని వాటి ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిందని తెలిపారు.

వీటిలో కొన్ని అంశాలపై నా వివరణ తీసుకున్నారని తెలిపారు. తమ్మిడి హట్టి నుంచి కాళేశ్వరంకు సైట్ ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారన్నారు. అలా మార్చడమే మాకున్న ఆధారం అని చెప్పాన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదని, బ్యారేజీ
ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర అభ్యంతరాలు వచ్చాయని తెలిపానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news