భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంకు ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక కామెంట్స్ చేసారు. రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ చేశాము అని చెప్పిన ఆయన.. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు తాకట్టుపెట్టి కొందరు రైతులకే రైతు బంధు వేశారు. పది ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్.. గ్రామసభ లను అడ్డుకుంటుంది.
ఇక నల్లగొండలో రైతు మహా ధర్నా ఎందుకో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి. మొత్తం చిల్లర రాజకీయాలతో బీఆర్ఎస్ కాలం వెళ్లదీస్తుంది. నల్లగొండ రైతు మహా ధర్నాలో.. పది ఏళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదో బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అని ప్రజలకు సూచించారు ఆయన. అలాగే జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. ఇక పదవులు కోల్పోయిన బాధను బీఆర్ఎస్ నేతలు ప్రజలపై రుద్దుతున్నారు అని మంత్రి తుమ్మల తెలిపారు.