జనవరి నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తాం : మంత్రి తుమ్మల

-

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు  తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ, సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్ఎస్ విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు.

గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ను తాకట్టు పెట్టి ఎన్నికలకు ముందు రాజకీయం కోసం కొంత మంది రైతులకు రైతు బంధు వేశారన్నారు. పది ఏండ్లగా రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని గత ప్రభుత్వం గ్రామ సభలను అడ్డుతగులుతుందని మండిపడ్డారు. నల్లగొండలో ఎందుకు రైతు దీక్ష చేస్తారని బీఆర్ఎస్ ను తుమ్మల ప్రశ్నించారు: రైతులకు రుణమాఫీ, రైతుల భరోసా, సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చినందుకా రైతు దీక్ష చేస్తున్నారని నిలదీశారు. చిల్లర మల్లర రాజకీయాలతో పబ్బం గడపవద్దని హితవు పలికారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలో వారి ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయండని తుమ్మల ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news