హైదరాబాద్‌ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

-

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు.

CM Revanth Reddy reached Hyderabad after completing his visit to Davos

తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డుస్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దానం నాగేందర్‌ కూడా స్వాగతం పలికారు. కాగా, దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు రానున్నాయని సమాచారం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ 40,232 కోట్ల పెట్టుబడులు సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news