విజయసాయిరెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయాలలో ఉన్నా, లేకపోయినా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
శనివారం రోజు విశాఖ జువైనల్ హోమ్ ని పరిశీలించిన అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి కలలోకి గొడ్డలి వచ్చిందేమో..? అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చునని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో దావోస్ లో నాలుగు సార్లు సమ్మిట్ జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లి వచ్చారని.. అక్కడికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలాగా బిత్తర చూపులు చూస్తూ “ఇట్స్ లెగ్త్ క్వశ్చన్” అన్నాడని ఎద్దేవా చేశారు.
మానసికంగా క్షోభ అనుభవిస్తున్న పిల్లలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు అనిత. తాము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే వైసిపి వాళ్ళు ఈ ఏడు నెలలలో రోడ్లమీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడుతుందని పేర్కొన్నారు.