పుంగనూరులో నా సొంత డబ్బులతో నిర్మించుకున్న నిర్మాణాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నాపై ఎన్ని విచారణలు అయిన చంద్రబాబు వేసుకోవచ్చు. అధికారులే కాదు నేరుగా చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ వచ్చి విచారించకోవచ్చు అని అన్నారు. 20 ఏళ్ల క్రితం సొంత డబ్బులతో కొన్న భూములను ఇప్పుడు వ్యక్తిత్వాన్ని చెడగొట్టాలని ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా భూములు మీద అసత్య ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు నా పక్కనే వందల ఎకరాలలోను ఉన్న చంద్రబాబు ఎస్టేట్ గురించి ఏం సమాధానం చెప్తాడు అని ప్రశ్నించారు.
అలాగే ఆ భూములను చంద్రబాబు ఎలా కొన్నాడు అటవీశాఖ భూములను కబ్జా చేశాడా లేదంటే నిజంగా కొన్నాడా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది. పుంగనూరులో చంద్రబాబు అక్కడ స్టేట్ ఎలా కోన్నాడు.. ఎప్పుడూ కోన్నాడనే దానిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ అగ్నిప్రమాదక ఘటన పైన విచారణకు ఆదేశించి ఏం చేసారు.. ఇక్కడ విచారణ చేపట్టిన ఏమీ దొరకదు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.