ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు లోకి రానున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని పేర్కొంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/chandrababu-17.jpg)
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి. ముందుగానే ఛార్జీలను సవరించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ ఛార్జీల పెంపు ఎఫెక్ట్ తో.. ఏపీలో రిజిస్టర్ ఆఫీసులు..కిటకిటలాడుతున్నాయి. భూమి క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం జనం బారులు తీరారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ ధరలు పెరనున్నాయి. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
ఛార్జీల పెంపు ఎఫెక్ట్.. ఏపీలో కిటకిటలాడిన రిజిస్టర్ ఆఫీసులు..
భూమి క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం బారులు తీరిన జనం
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ ధరల పెంపు
మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ… pic.twitter.com/pTyUd0b9Ur
— Pulse News (@PulseNewsTelugu) January 31, 2025